కొందరు తమ అభిమాన సినీ తారలను కలుసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాయి. షూటింగ్ జరిగే ప్లేస్‌లకు, ఏదైనా ఈవెంట్‌లు జరిగే చోట్లకి వెళ్లి వారిని కలవాలని చూస్తారు. కానీ భాస్కర్ రావు అనే అభిమాని మాత్రం హీరోయిన్ పూజా హెగ్డేను కలిసేందుకు ఐదు రోజులు నిరీక్షించాడు. ఐదు రాత్రులు ఫుట్‌పాత్‌పైనే పడుకున్నాడు. ఈ విషయాన్ని పూజా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. భాస్కర్‌రావుతో జరిపిన సంభాషణ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. డీజే సినిమా అప్పటినుంచి పూజా అంటే అభిమానమని భాస్కర్‌రావు చెప్పారు. ఐదు రోజులుగా రోడ్లపై పడుకుంటానని భాస్కర్‌రావు చెప్పడంతో.. ఇంకెప్పుడూ అలా చెయ్యవద్దని పూజా కోరారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని సూచించారు. అవసరమనుకుంటే సోషల్ మీడియాలో మెసేజ్ చేయవచ్చని చెప్పారు.
పూజా కోసం ఐదు రోజులు ముంబై ఫుట్‌పాత్‌పై..
Jan 15 2020 4:36 PM | Updated on Jan 15 2020 4:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement