దుమ్మురేపుతున్న హీరోయిన్‌ వీడియోలు! | Deepika Padukone Joins TikTok And Shares Rap And Dancing Song Videos | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న హీరోయిన్‌ వీడియోలు!

Jan 4 2020 4:28 PM | Updated on Mar 21 2024 8:24 PM

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘టిక్‌టాక్‌’ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ యాప్‌తో ఎంతో మంది యువతి, యువకులు సెలబ్రిటీలుగా కూడా మారిపోయారు. దీంతో  చిన్నపిల్లలు, మహిళల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఈయాప్‌లో మునిగితేలుతున్నారు. అయితే సెలబ్రిటీలు కూడా సరదాగా ‘టిక్‌టాక్‌’లో జోక్స్‌, డైలాగ్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేసి అభిమానుల కోసం షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కూడా చేరారు. దీపిక తన సన్నిహితులతో కలిసి పాటలకు చిందులేస్తూ.. డైలాగ్స్‌ చెబుతున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement