నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి | Chiranjeevi Speech In SYE RAA Pre Release Event In Bangalore | Sakshi
Sakshi News home page

నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. : చిరంజీవి

Sep 29 2019 9:14 PM | Updated on Sep 29 2019 10:03 PM

‘రామ్‌ చరణ్‌ రెండో సినిమా మగధీరలో చేసిన క్యారెక్టర్‌ చూసీ జెలసీ ఫీలయ్యాను. నేను ఇన్ని సినిమాలు చేసినా.. ఇలా కత్తి పట్టుకుని చేసే అవకాశం నాకు రాలేదని చరణ్‌తో అన్నాను. ఆ తర్వాత దాన్ని వదిలేశాను. కానీ చరణ్‌లో ఆ ఆలోచన ఉండిపోయింది. అందుకే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి రూపంలో చరణ్‌ నాకు పెద్ద గిప్ట్‌ అందజేశాడు. నా సినీ జీవితంలో గుర్తుండిపోయేలా.. ఈ సినిమాను నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను ఏం సాధించానంటే రామ్‌ చరణ్‌ను సాధించానని గర్వంగా చెబుతాన’ని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బెంగళూరులో ఆదివారం జరిగిన సైరా నరసింహారెడ్డి కన్నడ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్, కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌, నిర్మాత రామ్‌చరణ్‌, హీరోయిన్‌ తమన్నా హాజరయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement