హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌! | Bigg boss 3 Telugu, KING Nagarjuna is Back | Sakshi
Sakshi News home page

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

Sep 7 2019 4:56 PM | Updated on Mar 22 2024 11:30 AM

బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ఏడో వీకెండ్‌ను హీటెక్కించేందుకు నాగార్జున వచ్చేశాడు. గతవారం రమ్యకృష్ణ తన హోస్టింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లిన నాగ్‌.. ఆరోవారం హోస్టింగ్‌ చేయలేకపోయాడు. దీంతో ఈ వీకెండ్‌ హౌస్‌మేట్స్‌కు దర్శనమివ్వనున్న నాగ్‌.. వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

దొంగలు దోచిన నగరం టాస్క్‌లో.. హింస ఎక్కువైందన్న కారణంతో టాస్క్‌ను రద్దుచేసేశాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో అలీరెజా, రాహుల్‌ ఒకర్నొకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. బిగ్‌బాస్‌ హెచ్చరించినా.. టాస్క్‌లో హింసే ప్రధానంగా చోటుచేసుకుంది. అయితే ఇదే విషయంపై పునర్నవిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె చెప్పిన జవాబుకు నాగ్‌ గట్టి కౌంటర్‌ ఇస్తూ.. అలీకి సపోర్ట్‌గా మాట్లాడు. అయితే టాస్క్‌ విషయంలో అలీ ప్రవర్తించిన తీరుపై మండిపడ్డట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్‌లో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement