మూడో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ | Cricket-Majestic Kohli guides India to seven-wicket win | Sakshi
Sakshi News home page

Oct 24 2016 6:24 AM | Updated on Mar 21 2024 8:56 PM

దనలో తనకు అలవాటైన రీతిలో కోహ్లి మరో అలవోక సెంచరీ... ఈ రోజు చెలరేగాల్సిందే అన్నట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి పట్టుదలగా చక్కటి ఇన్నింగ్స్ ఆడిన ధోని... ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్ల క్లాసిక్ బ్యాటింగ్ భారత్‌కు న్యూజిలాండ్‌పై కీలక విజయాన్ని అందించింది. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి వెంటనే కోలుకుంటూ సిరీస్‌లో మన జట్టు మళ్లీ ఆధిక్యంలో నిలిచింది. రికార్డుల విరాట్ చివరి వరకూ నిలిచి తనకే సాధ్యమైన రీతిలో మరో ఘన విజయాన్ని జట్టు ఖాతాలో చేర్చాడు. అంతకుముందు ఒక దశలో 46 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయినా... నీషమ్, హెన్రీ ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించగలిగిన న్యూజిలాండ్ చివరకు దానిని కాపాడుకోవడంలో మాత్రం విఫలం అయింది.

Advertisement
 
Advertisement
Advertisement