వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. 9 నుంచి 12 వరకు నాలుగు రోజుల పాటు 17 కుటుంబాలను ఓదారుస్తారు.