అవినీతి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు మూడేళ్ల పాలనలో భయంకరమైన అవినీతి జరిగిందన్నారు. శనివారం అంబటి రాంబాబు గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అవినీతి అధికారుల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామంటున్నారని, కేవలం అధికారులే అవినీతికి పాల్పడుతున్నారా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Apr 29 2017 3:42 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement