నాగార్జున యూనివర్సిటీ వద్ద వైసీపీ ధర్నా | YSRCP Leaders Dharna at Nagarjuna University | Sakshi
Sakshi News home page

Aug 3 2015 12:50 PM | Updated on Mar 22 2024 11:04 AM

నాగార్జున యూనివర్సిటీ ముందు జిల్లా వైఎస్సాసీపీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. ఆర్కిటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై నిజనిర్ధారణ కోసం వైసీపీ నాయకులు ఈ రోజు యూనివర్సిటీ కి వచ్చారు. అయితే పోలీసులు వారిని వర్సిటీ లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ సందర్శన కోసం ఆదివారమే అనుమతి తీసుకున్నామని నేతలు తెలిపారు. అయినా పోలీసుల తీరు మారకపోవడంతో వారు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు దిగివచ్చారు. యూనివర్సిటీ లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ధర్నా విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement