రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్లో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ... ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.