రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘మీకు ఎలాంటి కష్టమొచ్చినా అధైర్యపడకండి. అండగా నేనుంటా. మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో పోరాడతా. అయినా స్పందించకపోతే అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తా’అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. వారి కన్నీటి గాథలను విని ఆయన కదిలిపోయారు. తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో అనాథలుగా మారిన ఇద్దరు చిన్న పిల్లలను చూసి ఆయన కంటనీరు ఉబికింది. ఆ బిడ్డల చదువుల బాధ్యతలను తాము తీసుకుంటామని బంధువులకు జగన్ హామీ ఇచ్చారు.
Jan 7 2016 6:46 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement