తెలంగాణపై వేచి చూసే ధోరణీలో ఉన్నామని, అందుకే మౌనం పాటిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్రానికి సహకరిస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న పార్టీగా ఈ దశలో తొందరపాటు పడబోమన్నారు. తాము మాట్లాడితే రాజకీయం అంటున్నారని అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నామని వివరించారు. సీమాంధ్రులెవరూ తెలంగాణను వ్యతిరేకించడం లేదన్నారు. ఆస్తులు, వ్యాపారాలున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి లాంటి వారే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. జగ్గారెడ్డి, వీరాశివారెడ్డిలతో సీఎం కిరణ్ అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. టి.కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పథకం ప్రకారమే వీరశివారెడ్డిని, జగ్గారెడ్డిని సీఎం కిరణ్ ప్రవేశపెట్టారన్నారు. రాజీమాలకు అసలు కుట్రదారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆరోజు ఢిల్లీలో రోశయ్య ఒప్పుకుని తీరా హైదరాబాద్ వచ్చాక మాట మార్చారని, విమానం దిగాక చంద్రబాబుతో చేతులు కలిపారని గుర్తు చేశారు. రాజీనామాల పథకాన్ని ఆనాడు అమలు చేసింది రోశయ్య, చంద్రబాబేనని హరీష్‌రావు ఆరోపించారు.
Jul 26 2013 1:45 PM | Updated on Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
Advertisement
