కుప్పకూలిన సిటీ లైట్ హోటల్ భవనం శిథిలాల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఇద్దరు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇనుప చువ్వలను, సిమెంట్ దిబ్బలను జెసిబీల సాయంతో తొలగిస్తున్నారు. గత రాత్రి శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని రెస్క్యూ టీం కాపాడింది. హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసే వైనీ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడు కర్ణాటకకు చెందినవాడు. బతుకుదెరువు కోసం వచ్చి హోటల్‌లో వెయిటర్‌గా కుదిరాడు. రెస్క్యూటీం చొరవతో వైనీ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మృతి చెందగా 21 మంది గాయపడ్డారు.
Jul 9 2013 11:15 AM | Updated on Mar 21 2024 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement