కర్నూలు జిల్లా వలగొండ మండలం దేవరగుట్ట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు దేవీనగర్ కు చెందిన పద్మావతి(18)గా గుర్తించారు. యువతితో పాటు వచ్చిన యువకులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలు తన స్నేహితురాళ్లు శ్రీదేవి, గంగ మరో ముగ్గురు యువకులతో కలిసి మూడు రోజుల క్రితం కారులో దేవరగుట్టకు వచ్చారు. కారులో నుంచి శ్రీదేవి, గంగలను బయటకు తోసేసి గత రాత్రి పద్మావతిని ముగ్గురు యువకులు ఎత్తుకెళ్లారు. కారులోనే అత్యాచారం చేసి ఆమెను ఓ వంతెన కింద పడేశారు. పశువుల కాపరులు ఈ ఉదయం ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. ఆమెను ఆలూరు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.