ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్ | united activists arrested in delhi | Sakshi
Sakshi News home page

Nov 10 2013 8:07 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రదేశ్ సమైక్యవాదులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విశాలాంధ్ర మహాసభ సభ్యులకు గాయాలయ్యాయి. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. సమైక్యవాదులు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. తెలుగుతల్లి, వందేమాతరం గేయాలు పాడుతూ నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్లకు నిరసనగా వారు నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement