వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పెళ్లి బృందంపైకి టిప్పర్ దూసుకెళ్లడంతో.. ఇద్దరు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.