టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్పై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ‍్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ది ప్రెస్లో మాట్లాడారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు.