ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ కరువు పేరుతో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధపడ్డారని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. తక్కువ ఖర్చుతో బైరవాన్ తిప్ప ప్రాజెక్టు, పేరూరు డ్యామ్లకు నీళ్లు ఇవ్వవచ్చని, అయితే కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.