దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపట్ల సినీలోకం దిగ్భ్రాంతి చెందింది. పలువురు నటీనటులు, రాజకీయ నాయకులు, సినిమా విమర్శకులు, సినీ రచయితలు కూడా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ప్రతి విషయంలో ఆయన ప్రత్యేకత కనబరిచేవారని, ఆయన చనిపోవడం సినీ పరిశ్రమతో పాటు యావత్ రాష్ట్రానికి తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హీరో సుధీర్ బాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా పలువురు ప్రముఖులు దాసరి మృతిపట్ల తమ సంతాపం తెలిపారు.