తెలంగాణలో సరికొత్త పరిపాలనా ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. మొత్తం 31 జిల్లాలతో తెలంగాణ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో చేపట్టిన కొత్త జిల్లాలు విజయదశమి రోజున సాకారమవుతున్నాయి. ప్రస్తుతమున్న 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి.. అదనంగా 21 కొత్త జిల్లాలు, 25 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటాక తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కేబినెట్ భేటీ నిర్వహించకుండానే మంత్రులందరికీ ఫైల్‌ను పంపి సంతకాలు తీసుకుని ఉత్తర్వులు జారీ చేశారు