'అన్యాయం జరుగుతుంటే..జగనన్న చూస్తూ కూర్చోరు' | Telangana decision injustice to Seemandhra says Sharmila | Sakshi
Sakshi News home page

Sep 16 2013 1:43 PM | Updated on Mar 21 2024 5:15 PM

అందర్ని పిలిచి చర్చలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని షర్మిల గుర్తు చేశారు. అయితే ప్రజాస్వామ్యం అనే విషయాన్నే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయి వ్యవహారించిందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల సోమవారం శ్రీకాకుళం జిల్లా రాజాంలో మాట్లాడారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే..జగనన్న చూస్తూ కూర్చోరని షర్మిల అన్నారు. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతోందన్నారు. కోట్ల మంది గుండెలు మండి రోడ్ల మీదకు వస్తే.. అధికార పార్టీ నేతలు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఘాటుగా షర్మిల విమర్శించారు. నేటితో సమైక్య శంఖారావం బస్సు యాత్ర ముగియనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement