రాష్ట్రంలో సభా సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టించనున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలంలో ఏం చేశారంటూ అధికార పక్షంపై ముప్పేట దాడి చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమైపోతే.. ఎదురుదాడితో దీటుగా సమాధానం ఇచ్చేందుకు పాలక పక్షం సన్నద్ధమైపోయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గురువారం జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. సెలవు రోజులు పోగా 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా 20 దాకా అంశాలు చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
Dec 16 2016 7:39 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement