ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు! | telangana-advocate-general-ramakrishna-reddy-oppose-higher-education-decision-for-eamcet-counselling | Sakshi
Sakshi News home page

Aug 11 2014 8:03 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.చట్ట ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. దీంతో ఏ ఒక్క రాష్ట్రానికో అధికారం ఇచ్చినట్లు కాదన్నారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో కౌన్సిలింగ్ నిర్వహించాలని రామకృష్ణా రెడ్డి సూచించారు. కామన్‌ అడ్మిషన్లను ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించాలనడం సరైనది పద్దతి కాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎవరికి ఇవ్వాలన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తమ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి విధానాలకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయంలో ధర్మాసనం జోక్యం ఉండదన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement