సెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి హరీష్‌రావు, సదారాం కనుసన్నల్లో సభ నడుస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అసెంబ్లీలా కాకుండా టీఆర్‌ఎస్ కార్యాలయంలా నడుస్తోందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలకతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలన్నారు.