చెన్నైలో ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... భవనం కూలిన ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వైఎస్ జగన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ భవన నిర్మాణ కార్మికుల మృతుల్లో అత్యధికులు ఉత్తరాంధ్రకు చెందిన వారే. దాంతో ఉత్తరాంధ్రలోని మృతుల కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించి... ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే. చెన్నైలో జూన్ చివరి వారంలో 11 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 54 మందికిపైగా మరణించిన విషయం విదితమే.