విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు అండతో కొందరు వ్యక్తులు దేవాలయాల భూములను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఆలయాల భూములను రక్షించడం కోసం శారదాపీఠం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. స్వామీజీ జన్మదినోత్సవాన్ని గురువారం వేడుకగా నిర్వహించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో జరిగిన జన్మదినోత్సవ ఆత్మీయ సభలో స్వామీజీ భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. రూ.158 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్మును కాలువలు, రోడ్లకు వినియోగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
Nov 4 2016 9:31 AM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement