డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కెల్విన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో మరో ఎనిమిదిమంది పేర్లు వెల్లడించినట్లు సమాచారం. నిందితులు పేర్కొన్న ఈ జాబితాలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించేందుకు తమకు అప్పగించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈమేరకు రెండు రోజుల కస్టడీకి అనుమతించడంతో ఎక్సైజ్ అధికారులు చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న అతడిని తమ కస్టడీకి తీసుకున్నారు. బాలనగర్ ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ బృందం అతడిని విచారించింది. కెల్విన్తో పాటు, ఖుద్దుస్, వాహిద్‌లను సిట్ అధికారులు విచారణ జరిపారు.
Jul 15 2017 6:30 PM | Updated on Feb 18 2025 1:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement