తానో ఎంపీనని.. గౌరవ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని, స్థాయిని మరచిపోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం వీరంగం సృష్టించారు. సీటు విషయంపై ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి దాడి చేశారు. ఎంపీ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ, తన చెప్పు తీసి ఎయిరిండియా అధికారిని కొట్టారు.