రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శన రసాభాసగా మారింది. అర్థనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారని కొంతమంది వ్యక్తులు దాడికి దిగి రచ్చరచ్చ చేశారు. ఆ పేయింటింగ్స్ వేసిన కళాకారుల్లో ఒకరిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని చిత్రాలను ఎత్తి కిందపడేసి ధ్వంసం చేశారు. మరో పెయింటింగ్‌ను ఎత్తుకెళ్లారు. గురువారం జైపూర్‌లో కళలపై సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొన్ని అర్ధనగ్న చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
Dec 8 2016 7:39 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement