క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ బుధవారం నెల్లూరు జిల్లాకు రానున్నారు. గూడూరు మండలంలో తాను దత్తత తీసుకున్న పుట్టమరాజు వారి కండ్రిగ గ్రామంలో పర్యటించనున్నారు. సచిన్ 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టమరాజు వారి కండ్రిగకు చేరుకుంటారు. అనంతరం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు.