ఓటుకు నోటు కేసులో 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి షరతులు విధించింది. 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి వెంట ఎస్కార్ట్ ఉండాల్సిందేనని, ఎవరితోనూ సమావేశాలు పెట్టకూడదని, అలాగే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఎవరినీ బెదిరించకూడదని, విచారణకు ఆటంకం కలిగించకూడదని సూచించింది. కాగా రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న ప్రధాన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ సమయంలో ఉన్నందున ...ఈ దశలో రేవంత్కు బెయిల్ ఇవ్వలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
Jun 10 2015 4:19 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement