రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్ | reserve bank gives two months more time for loan repayments | Sakshi
Sakshi News home page

Nov 22 2016 7:21 AM | Updated on Mar 21 2024 6:13 PM

అప్పులు చేసినవాళ్లు తిరిగి చెల్లించడానికి చేతిలో నగదు లేకపోవడంతో.. రిజర్వు బ్యాంకు వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోటి రూపాయల వరకు తీసుకున్న గృహరుణం, కారు రుణం, పంట రుణాలు.. ఇతర రుణాలను చెల్లించడానికి మరో 60 రోజుల అదనపు గడువు ఇచ్చింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు చెల్లించాల్సిన అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. కోటి రూపాయల లోపు వర్కింగ్ క్యాపిటల్‌గా తీసుకున్న సంస్థలకు సైతం ఇది వర్తిస్తుంది. వ్యక్తిగతంగా గానీ, వ్యాపారపరంగా గానీ తీసుకున్న రుణం కోటి రూపాయలు అంతకంటే తక్కువ అయి ఉండాలి. ఏ బ్యాంకులోనైనా లేదా ఎన్‌బీఎఫ్‌సీలో నైనా తీసుకున్న రుణాలకు సైతం ఇది వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement