‘గంటలు గంటలు క్యూలైన్లో నిల్చున్నా కరెన్సీ నోట్లు దొరకట్లేదు. నిన్న ఇదే సమయానికి వచ్చి సాయంత్రం దాకా లైన్ లో ఉన్నా. తీరా నా వంతు వచ్చేసరికి డబ్బులు అయిపోయాయి’ అని ఒక సోదరుడు.. ‘చేతిలో డబ్బుల్లేక ఇంట్లో వంట కూడా చేసుకోవట్లేద’ని మరో మహిళ.. ఇలా పలకరించిన అందరూ తమతమ బాధలు విన్నవించుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.