పోలీసులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రజాప్రతినిధిని చితకబాదారు. గ్రామ ప్రథమ పౌరుడన్న కనీస గౌరవం ఇవ్వకుండా లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి నల్లచెరువులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మేజర్ పంచాయతీ సర్పంచ్ రవికుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ప్రజా సమస్యలపైనా తక్షణమే స్పందిస్తుంటారు. నల్లచెరువు ఎస్సీ కాలనీవాసులు నీటి కోసం ఇబ్బంది పడుతుండడంతో సర్పంచ్ మంగళవారం రాత్రి ఆ కాలనీలో బోరు వేయించ డానికి వెళ్లారు.