ప్రపంచంలో ఎక్కడాలేని యువసంపద భారతదేశంలో ఉందన్నారు. దేశాభివృద్ధిలో కీలకమైన 80 కోట్ల మంది యువత కలలు, 160 కోట్ల బలమైన చేతులు దేశానికి అండగా ఉన్నాయి. ఒక దేశ అభివృద్ధికి ఇంతకంటే ఏం కావాలన్నారు. దేశంలోని యువత ఉద్యోగార్థులుగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించేవారుగా తయారు కావాలని కోరుకుంటున్నానన్నారు. 2030 తర్వాత ప్రపంచానికి అవసరమైన కార్మికశక్తి మన వద్ద ఉంటుందన్నారు.