నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ఓ నిరక్షరాస్యుడని, ఎవరినీ సంప్రదించకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని, అసలు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధ్వజమెత్తారు.