రెండున్నర ఏళ్లుగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతోన్న పరోక్ష యుద్ధం తారాస్థాయికి చేరింది. నిన్నటివరకు కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. బుధవారం ఏకంగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో నరేంద్ర మోదీ నన్ను హత్య చేయిస్తారేమోనంటూ సంచలనాత్మక ఆరోపణలు చేశారు. వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలను ఉద్దేశించి దాదాపు 10 నిమిషాలు మాట్లాడిన కేజ్రీవాల్.. జైలుకు వెళ్లేందుకు, హత్యలకు గురయ్యేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిపై పై ఈ స్థాయిలో విమర్శలకు దిగడం దేశరాజకీయాల్లో అరుదు.
Jul 27 2016 6:30 PM | Updated on Mar 20 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement