గుజరాత్ అగ్నిగుండమైంది. ఇతర వెనుకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళన హింసాత్మకమై, రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. పోలీసులపై తిరగబడ్డారు. వారిపై రాళ్లు రువ్వారు. వారి వద్ద నుంచి ఆయుధాలను లాక్కొనేందుకు ప్రయత్నించారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురు పోలీసులు సహా అనేకమంది గాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్మీ, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగాయి. అహ్మదాబాద్, సూరత్ సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో బుధవారం కర్ఫ్యూ విధించారు.
Aug 27 2015 7:44 AM | Updated on Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement