పాకిస్తాన్ ప్రాదేశిక జాలాల్లో వేట సాగించి అరెస్టైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాల్సిందిగా అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. కేసు విచారణ కోసం మలిర్ జిల్లా జైలుకు చేరుకున్న న్యాయమూర్తి సల్మాన్ అంజాద్ సిద్దిఖీ ముందు నిందితులందరూ తమ నేరాన్ని అంగీకరించారు.