ఆయిల్ ట్యాంకర్ దగ్ధం | Oil Tanker burnt in Nalgonda | Sakshi
Sakshi News home page

Aug 3 2015 6:25 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా మోతే మండలం నామవరం గ్రామంలోని పంజాబీ దాబా వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. స్పిరిట్ లోడుతో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను డ్రైవర్.. మోతే మండలం నామవరం గ్రామం సమీపంలో ఉన్న పంజాబీ దాబా వద్ద నిలిపాడు. డ్రైవర్, క్లీనర్లిద్దరూ తినేందుకు వెళ్లగా ట్యాంకర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్పిరిట్ ట్యాంకర్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చూస్తుండగానే కాలి బూడిదైంది. కాగా దాబాకు సమీపంలోనే పెట్రోల్ బంక్ కూడా ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement