'భూముల కోసం ప్రాణాలైనా ఇస్తాం' | nidamarru-farmers-protest-to-land-poolng | Sakshi
Sakshi News home page

Nov 17 2014 9:29 PM | Updated on Mar 20 2024 3:12 PM

రాజధానికి భూములు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు చెందిన రైతులు కరాకండీగా చెబుతున్నారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా మంగళగిరి మండలం నిడమర్రులో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. కావాలంటే తామందరం రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి డబ్బు ఎదురిస్తామని, తమ భూముల జోలికి రావొద్దంటూ అధికారులపై అన్నదాతలు మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తామని రైతులు హెచ్చరించారు. అప్పటివరకు రైతులపై చిందులు తొక్కిన గంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు అన్నదాతల ఆందోళనతో అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement