గ్యాంగ్స్టర్ నయీం తనను కూడా బెదిరించాడని సినీ నిర్మాత నట్టికుమార్ వెల్లడించారు. నర్సంపేటలో కోటి రూపాయల విలువ చేసే తన ధియేటర్ కు రూ.25 లక్షలిచ్చి లాక్కుడని తెలిపారు. నయీంకు కొంతమంది సినిమా పరిశ్రమ పెద్దలు కూడా సహకరించారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ధియేటర్లలో క్యాంటీన్లు అన్ని నయీంకు చెందినవేనని చెప్పారు.