రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆయన పరితపించాడు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా హోదా కోసం నినదించాడు. ప్లకార్డులు చేతబట్టుకుని, ఫ్లెక్సీలను భుజాన వేసుకుని ఉద్యమించాడు. తన ఆత్మబలిదానంతోనైనా కేంద్ర ప్రభుత్వం కనికరిస్తుందని ఆశ పడ్డాడు. పట్టపగలు.. వందలాది మంది నడుమ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివ్వెరపోయాయి. పత్రికలు పతాశ శీర్షికలతో కథనాలు రాశాయి. మునికోటి పార్థివ దేహాన్ని సందర్శించిన ముఖ్యనేతలందరూ సంతాపాలు, సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మునికోటి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇదంతా జరిగి సరిగ్గా నేటికి ఏడాది. అప్పట్లో మునికోటి త్యాగాన్ని పెద్ద ఎత్తున ప్రశంసించిన సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక సాయం తాలూకు వాగ్దానాన్ని విస్మరించారు. మళ్లీ మునికోటి కుటుంబం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు.
Aug 8 2016 8:57 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement