ముంబైలోని శక్తిమిల్స్‌లో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు దోషులకు స్థానిక సెషన్స్‌కోర్టు మరణశిక్ష విధించింది. విజయ్ జాదవ్ (19), కాసిమ్ బెంగాలి (21), మహమ్మద్ సలీమ్ అన్సారీలను(28)లకు ఉరిశిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి షాలిని ఫన్సల్కర్ జోషి శుక్రవారం తీర్పుచెప్పారు. ఈ ముగ్గురిని కోర్టు నిన్న దోషులుగా నిర్ధారించింది. కాగా ఈ ముగ్గురు నిందితులకు ఓ టెలిఫోన్ ఆపరేటర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు ఇప్పటికే యావజ్జీవ శిక్ష పడింది. పాడుపడిన శక్తిమిల్స్‌లోనే ఈ నిందితులు గత ఏడాది జూలైలో ఓ 18 ఏళ్ల టెలిఫోన్ ఆపరేటర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అదే ఏడాది ఆగస్టు 22న శక్తిమిల్స్ ఆవరణలోనే 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
Apr 4 2014 6:07 PM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement