టీడీపీకి మరో షాక్? | Motkupalli narasimhulu to join TRS? | Sakshi
Sakshi News home page

Jun 24 2015 7:14 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగల నుంది. టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని, గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 20 రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి మోత్కుపల్లితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement