వైఎస్సార్ జిల్లా కలెక్టరుపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. కలెక్టరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. కలెక్టర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అదే విధంగా అధికారుల పట్ల ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.