బిల్డింగ్‌పై నుంచి దూకి మెడికో ఆత్మహత్య | Medico student commits suicide at Nalgonda | Sakshi
Sakshi News home page

Oct 25 2016 7:40 AM | Updated on Mar 20 2024 3:45 PM

నల్లగొండ జిల్లాలో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియాలో మంచి ర్యాంకు సాధించి సీటు సంపాదించిన సాయికుమార్‌ రెడ్డి అనే వైద్య విద్యార్థి తన నివాసంలోని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.మెడిసిన్‌ చదవడం ఇష్టం లేకనే సాయికుమార్‌ ఆత్మహత్య పాల్పడినట్టు బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలిలో ఎక్కడా కూడా సూసైడ్‌ నోట్‌ ఎలాంటి సమాచారం లభించలేదు. మెడికో సాయికుమార్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement