ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రిమాండ్ వచ్చే నెల 13 వరకూ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో రేవంత్తో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాప్టియన్, ఉదయ్సింహాల జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో వారిని అధికారులు సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్నందున రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ ఏసీబీ అధికారులు ఇవాళ కోర్టులో మరో మెమో దాఖలు చేశారు.