జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ తలపెట్టిన కాకినాడ బహిరంగ సభకు పేరు ఖరారైంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నిర్వహించనున్న ఈ సభకు 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'గా నామకరణం చేసినట్లు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ఆదివారం తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ క్రీడామైదానంలో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుందని చెప్పారు.