జమ్మలమడుగులో జగన్‌కు ఘన స్వాగతం | jaganku brahmaratham | Sakshi
Sakshi News home page

Oct 6 2016 6:54 AM | Updated on Mar 21 2024 7:44 PM

కడప గడపలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజానీకం బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకొని జనం దారి పొడవునా ఎదురేగి స్వాగతం పలికారు. నాలుగురోడ్ల కూడలి చేరుకోగానే ఓపెన్‌ టాప్‌ వాహనంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు వైఎస్‌ జగన్‌ ముందుగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిశాలకు సమీపంలోనే ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement