కాపులకు రిజర్వేషన్ల సాధన కోసమే రోడ్డు ఎక్కామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తమకు ఈ పరిస్థితి కల్పించింది ఏపీ సీఎం చంద్రబాబేనని తెలిపారు. దాసరి నారాయణరావు నివాసంలో కాపు నాయకులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీని అమలు చేయమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు.